Mar 08,2023 22:09

చిన్నారుల నృత్యప్రదర్శన

ప్రజాశక్తి ధర్మవరం టౌన్‌ : కష్టపడి చదవండి భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందని వన్‌ టౌన్‌ సిఐసుబ్రమణ్యం తెలిపారు. స్థానిక జీవన్‌ జ్యోతి పాఠశాలలో గోల్డెన్‌ జూబ్లీ సెలబ్రేషన్స్ను బుధవారం ఘనంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా వన్‌ టౌన్‌ సిఐ సుబ్రమణ్యం హాజరయ్యారు. ఈ సందర్భంగా సిఐ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.ప్రతి విద్యార్థికి క్రమశిక్షణ ఎంతో మ ్నఖ్యమన్నారు. క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తే ఉన్నతస్థాయికి చేరుకుంటారన్నారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.