ప్రజాశక్తి - కడప ప్రతినిధి
జిల్లాలో స్టాఫ్‌నర్స్, ఎం ఎల్‌హెచ్‌పిల పోస్టింగ్స్ వ్యవహారం గుట్టు చప్పుడు గాకుండా సాగిపోతోంది. రాయల సీమ రీజియన్ జోన్ -4 పరిధిలో ఈనెల 17,18 తేదీల్లో 291 స్టాఫ్‌నర్స్ పోస్టులకు, 391 ఎంఎల్‌హెచ్‌పి పోస్టులకు కౌన్సెలింగ్ నడిచింది. ఆర్‌డి కార్యా లయం మొదటి విడతలో మిగిలిపోయిన పోస్టింగులకు రెండవ విడత కింద ఈనెల 21న 52 మంది, 28 ఎంఎల్‌హెచ్‌పి పోస్టు లకు కౌన్సెలింగ్ నిర్వహించింది. ఇందులో ఖాళీల జాబితాను నోటీస్‌లో పెట్టకుండా, సెల్ మెస్సేజ్‌ల రూపంలో ఉద్యోగార్థులకు సమా చారం పంపిస్తూ స్టాఫ్‌నర్స్ పోస్టింగ్స్ వ్యవహారం నడుస్తుండడంపై పెద్దఎత్తున విమర్శలు ఉన్నాయి. ఒకవేళ సెల్‌మెస్సేజ్ చూడని వారి పరిస్థితేమిటనే వాదన వినిపిస్తోంది. స్టాఫ్‌నర్స్, ఎంఎల్‌హెచ్‌పి పోస్టుల కౌన్సిలింగ్ ముగిసిన అనంతరం మిగిలిపోయిన ఖాళీలకు 15 రోజుల తర్వాత కౌన్సెలింగ్‌కు పిలవాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. ఇటువంటి నిబంధన ఒకటి ఉందనే గైడ్‌లెన్స్ విస్మరించి ఇష్టా రాజ్యంగా పోస్టింగ్ వ్యవహారం సాగుతుండడం విమర్శలకు ఆస్కారాన్ని కలిగిస్తోంది. కౌన్సె లింగ్ ముగిసిన వారం రోజుల వ్యవధిలోనే భర్తీకి నోచని ఖాళీలను భర్తీ చేస్తుండడంపై విస్మయాన్ని కలిగిస్తోంది. 15 రోజుల గడువు ముగిసిన అనంతరం మొదటి విడత కౌన్సెలింగ్‌కు హాజరుకాని వారి పూర్తిస్థాయి వివరాలు అందు బాటులోకి వచ్చే అవకాశం ఉండడంతో ఉద్యోగార్థులకు ఖాళీల పట్ల స్పష్టత లభించ నుందనే వాదన వినిపిస్తోంది. రెండవ విడత కౌన్సిలింగ్‌లో ఉద్యోగార్థులకు తమకు అందుబాటులోని ఖాళీలను ఎంపిక చేసు కునే వెసులుబాటు లభించేది. కానీ ఆర్‌డి కార్యాలయం ఉన్నతా ధికారుల ఆదేశాల పేరుతో స్టాఫ్‌నర్స్ పోస్టుల భర్తీ వ్యవ హారాన్ని ఇష్టారాజ్యంగా నిర్వహిస్తుండడంపై విమర్శల వర్షం కురుస్తోంది. రెండవ విడత కౌన్సిలింగ్‌కు హాజరయ్యే ఉద్యోగార్దులు ఖాళీల వివ రాలు తెలియక పోవడంతో ఆప్షన్స్ ఎంపికలో గందరగోళం నెలకొంది. దీనికితోడు స్టాఫ్‌నర్స్ పోస్టింగ్స్ ఉత్తర్వులపై డిప్యూటీ డైరెక్టర్ సంతకం చేయాల్సి ఉన్నట్లు తెలు స్తోంది. కానీ సూప రింటెం డెంట్ స్థాయి అధికారి సంతకాలతో పోస్టింగ్స్ వ్యవహారం సాగుతుండడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలాఉండగా ఖాళీల గుర్తింప ులోనూ గందరగోళమే నడు స్తోందనే వాదన వినిపిస్తోంది. ఇందుకు ఉదా హరణ నంద్యాల జిల్లాలోని దీపకుంట, కొత్తబురుజు ప్రాంతాల్లో ఖాళీలు లేకపోయినప్ప టికీ ఖాళీలను చూపించి పోస్టింగ్ వ్యవహారం సాగుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా స్టాఫ్‌నర్స్ పోస్టింగ్స్ వ్యవ హారంలో రిమ్స్‌లో పని చేస్తున్న ఓ యూనియన్ నాయకుని డిప్యూ టేషన్‌పై నియమిం చుకుని ఆయన పర్యవేక్షణలో సాగుతున్న స్టాఫ్ నర్స్ పోస్టింగ్ వ్యవ హారం పారదర్శ కతను ప్రశ్నార్థకంగా మారు స్తో ందనే వాదన వినిపిస్తోంది. దీనిపై ఫోన్‌లో మెడి కల్ అండ్ డైరెక్టర్ రామిరెడ్డిని సంప్ర దించగా గైర్హాజరీ పోస్టులను భర్తీ చేసుకునే అవకాశం ఉందని, కానీ నోటీస్‌బోర్డులో ఖాళీల వివరాలను విడుదల చేయాలని, డిప్యూటీ డైరెక్టర్ సంతకాలు చేయడం ప్రొసీజర్‌ను పాటించాలని పేర్కొనడం గమనార్హం.
ఉన్నతాధికారుల
ఆదేశాల మేరకే పోస్టింగ్స్
జిల్లాలో స్టాఫ్‌నర్స్, ఎంఎల్‌హెచ్‌పి గైర్హాజరీలకు పోస్టింగ్స్ వ్యవ హారం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నడుచుకుంటున్నా.పోస్టింగ్స్ నియామకాల్లో పారదర్శకంగానే వ్యవహరిస్తున్నా.
- డాక్టర్ కోటేశ్వరి, ఆర్‌డి కార్యాలయ ఉన్నతాధికారి. కడప.కౌన్సెలింగ్‌కు హాజరైన స్టాఫ్‌నర్సులు (ఫైల్‌ఫొటో)










