Jul 11,2023 22:05

ఉత్కంఠ పోరులో బంగ్లా చిత్తు..
సిరీస్‌ కైవసం
చిట్టగాంగ్‌: భారత మహిళల క్రికెట్‌ జట్టు వరుసగా రెండో టి20లోనూ గెలిచి మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది. మంగళవారం జరిగిన రెండో టి20లో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సేన 8పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ మహిళలపై విజయం సాధించింది. స్వల్ప స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో భారతజట్టు బంగ్లాదేశ్‌ను ఓడించి మూడు టి20ల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే 2ా0తో కైవసం చేసుకుంది. ఆఖరి ఓవర్‌ వరకూ విజయం దోబూచులాడిన పోరులో షఫాలీ వర్మ సంచలన బౌలింగ్‌తో జట్టును గెలిపించింది. దీప్తి శర్మకు 'ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డు లభించింది. టాస్‌ గెలిచి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 95 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్‌ షఫాలీ వర్మ(19) టాప్‌ స్కోరర్‌. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌(0), జెమీమా రోడ్రిగ్స్‌(8), మంధాన (13), హర్లీన్‌ డియోల్‌(6) విఫలమయ్యారు. బంగ్లా బౌలర్లు సుల్తానా ఖాతూన్‌కు మూడు, ఫాతిమాకు రెండు వికెట్లు దక్కాయి. స్వల్ప లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్‌ తడబడింది. భారత స్పిన్నర్ల దెబ్బకు 87 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ నిగార్‌ సుల్తానా(38) మాత్రమే రెండంకెల స్కోరు చేసింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ, షఫాలీ వర్మ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.
షెఫాలీ ఒకే ఓవర్లో 4 వికెట్లు..
ఆఖరి ఓవర్‌ వరకూ ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో బంగ్లా విజయానికి 10 పరుగులు కావాలి. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ షఫాలీ వర్మకు బంతి ఇచ్చింది. ఓ ఓవర్లో బంగ్లా జట్టు 4 వికెట్లు కోల్పోయి ఒక్క పరుగు మాత్రమే చేసింది. తొలి బంతికి రాబియా రనౌట్‌ కాగా.. రెండో బంతికి నహిద క్యాచ్‌ ఔటయ్యింది. నాలుగో బాల్‌కు ఫాతిమా రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ బాట పట్టగా.. ఇన్నింగ్స్‌ చివరి బంతికి మారూఫా స్టంపౌట్‌గా వెనదిరిగింది. దాంతో, భారత జట్టు 8 పరుగులతో సంచలన విజయం సాధించింది.
స్కోర్‌బోర్డు..
భారత మహిళల ఇన్నింగ్స్‌: స్మృతి మంధాన (బి)నహిద అక్తర్‌ 13, షెఫాలీ వర్మ (సి)శోభన (బి)సుల్తానా ఖాతున్‌ 19, రోడ్రిగ్స్‌ (స్టంప్‌)నిగర్‌ సుల్తానా (బి)రబెయా ఖాన్‌ 8, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (బి)సల్తా ఖాతున్‌ 0, యస్టికా భాటియా (సి)షోమా అక్తర్‌ (బి)ఫహిమా ఖాతున్‌ 11, హర్లిన్‌ డియెల్‌ (సి)రబెయా ఖాన్‌ (బి)సుత్తానా ఖాతున్‌ 6, దీప్తి శర్మ (సి)షమిమా సుల్తానా (బి)ఫహిమా ఖాతున్‌ 10, అమన్‌జ్యోత్‌ కౌర్‌ (సి)షోభనా మోస్ట్రారు (బి)మరుఫా అక్తర్‌ 14, పూజ వస్త్రాకర్‌ (నాటౌట్‌) 7, మిన్ను మణి (నాటౌట్‌) 5, అదనం 2. (20 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి) 95పరుగులు.
వికెట్ల పతనం: 1/33, 2/33, 3/33, 4/48, 558, 6/61, 7/82, 8/84
బౌలింగ్‌: మరుఫా అక్తర్‌ 4-0-28-1, నహిదా అక్తర్‌ 4-0-14-1, సుల్తానా ఖాతూన్‌ 4-0-21-3, ఫహిమా ఖాతూన్‌ 4-0-16-2, రబెయా ఖాన్‌ 4-0-16-1
బంగ్లాదేశ్‌ మహిళల ఇన్నింగ్స్‌: షమీమా సుల్తానా (సి)షెఫాలీ (బి)మిన్ను మణి 5, షత్తి రాణి (సి)హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (బి)దీప్తి శర్మ 5, ముర్తీదా ఖాతున్‌ (బి)బారెడ్డి అనూహ 4, నిగర్‌ సుల్తానా (స్టంప్‌)యస్టికా భాటియా (బి)దీప్తి శర్మ 38, రీతు మోని (ఎల్‌బి)మిన్ను మణి 4, షోమా అక్తర్‌ (సి)హర్లిన్‌ డియెల్‌ (బి)షెఫాలీ వర్మ 6, రబెయా ఖాన్‌ (రనౌట్‌)అమన్‌జ్యోత్‌ కౌర్‌/షెఫాలీ వర్మ 0, సుల్తానా ఖాతున్‌ (నాటౌట్‌) 0, ఫహిమా ఖాతున్‌ (సి అండ్‌ బి)షెఫాలీ వర్మ 0, మరుఫా అక్తర్‌ (స్టంప్‌)యస్టికా భాటియా (బి)షెఫాలీ వర్మ 0, అదనం 18, (20 ఓవర్లలో ఆలౌట్‌) 87పరుగులు.
వికెట్ల పతనం : 1/10, 2/12, 3/23, 4/30, 5/64, 6/86, 7/87, 8/87, 9/87, 10/87
బౌలింగ్‌: పూజ వస్త్రాకర్‌ 1-0-10-0, మిన్ను మణి 4-1-9-2, దీప్తి శర్మ 4-0-12-3, బారెడ్డి అనూష 4-0-20-1, షెఫాలీ వర్మ 3-0-15-3, జెమిమా రోడ్రిగ్స్‌ 4-0-18-0