Mar 11,2023 18:52

విరాళం అందజేస్తున్న దృశ్యం

ప్రజాశక్తి -కందుకూరు : కందుకూరు అంకమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణం కోసం ఎంఎల్‌ఎ మానుగుంట మహీధర్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణ కమిటీ సభ్యుల నిరంతర పర్యవేక్షణలో శరవేగంగా నిర్మాణం జరుగుతుంది. భక్తులు తమ వంతు సహాయ సహకారాలు, విరాళాలు విరివిగా అందజేస్తున్నారు. శనివారం పాకల శ్రీనివాసరావు భార్య పావని పునర్నిర్మాణం కోసం రూ.5,116లు విరాళంగా అందజేశారు. యెనిమిరెడ్డి వెంకటరెడ్డి, మంచి రాజు మురళీమోహన్‌, కోవూరు మాల కొండయ్య పాల్గొన్నారు.