ప్రజాశక్తి-విజయవాడ: ప్రజాసమస్యల పరిష్కార దిశగా నగర పాలక సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్‌లో మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వివిధ సమస్యలపై ప్రజలు అందించిన 14 అర్జీలను సోమవారం స్పందన ద్వారా స్వీకరించారు. ప్రజలు ఎదుర్కొను సమస్యలపై వచ్చిన అర్జీలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. స్పందన కార్యక్రమంలో ప్రధానంగా పట్టణ ప్రణాళిక 7, ఇంజనీరింగ్ 2, పబ్లిక్ హెల్త్ విభాగం 2, రెవిన్యూ విభాగం 2, అర్జీలు వచ్చినవి. కార్యక్రమంలో అదనపు కమిషనర్(జనరల్) యం.శ్యామల, అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) కె.వి సత్యవతి, జాయింట్ డైరెక్టర్ (అమత్) డా.కె.బి.ఎన్.ఎస్ లత, చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకర రావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.సి.హెచ్ బాబు శ్రీనివాసన్, ప్రాజెక్ట్ ఆఫీసర్ కె.శకుంతల, డిప్యూటీ కమిషనర్ (రెవిన్యూ) డి.వెంకటలక్ష్మి, సిటీ ప్లానర్ జి.వి.జి.ఎస్.వి ప్రసాద్, ఎస్టేట్ అధికారి కె.అంబేద్కర్ ఇతర అధికారులు పాల్గొన్నారు. సర్కిల్ కార్యాలయాలలో స్పందన 3 అర్జీలు. జోనల్ కమిషనర్లు నిర్వహించిన స్పందన కార్యక్రమంలో సర్కిల్-1 కార్యాలయంలో పట్టణ ప్రణాళిక -1, ఇంజనీరింగ్ విభాగం 2 అర్జీలు, సర్కిల్ 3 కార్యాలయంలో పబ్లిక్ హెల్త్ విభాగం 1 అర్జీ వచ్చినట్లు జోనల్ కమిషనర్లు తెలిపారు.
సబార్దినేట్స్‌కు యూనిఫారమ్ పంపిణీ
విజయవాడ నగరపాలక సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్‌లో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ, అవుతు శ్రీశైలజా, అధికారులతో కలిసి ఆఫీస్ సబార్దినేట్స్‌కు యూనిఫారమ్‌లను అందించారు. నగరపాలక సంస్థలో వివిధ విభాగములలో పని చేస్తున్న (క్లాసు-4) ఉద్యోగులైన 73 మంది ఆఫీస్ సబార్దినేట్స్‌కు 3 జతల యూనిఫారమ్‌లను అందించడం పట్ల ఆఫీస్ సబార్దినేట్స్ అసోసియేషన్ తరుపున ప్రెసిడెంట్ శీలం కరుణ కమిషనర్, మేయర్, డిప్యూటీ మేయర్‌లకు ధన్యవాదాలు తెలిపారు.










