స్త్రీలు అన్ని రంగాలలో ఎదగాలి
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్ : స్త్రీలు, పురుషులతో సమానంగా అన్ని రంగాలలో ఎదగాలని ఐద్వా జిల్లా కార్యదర్శి మస్తాన్ బీ పేర్కొన్నారు. బుధవారం ఆత్మకూరు పట్టణంలో సిపిఎం కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆత్మకూరు మండలం ఐద్వా నాయకురాలు షేక్ గుల్జర్ బేగం అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోనే మహిళలు కళాశాల విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఐద్వా జిల్లా కార్యదర్శి మస్తాన్ బీ, జిల్లా అధ్యక్షురాలు శివకుమారిలు మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో సగభాగమైన స్త్రీ సమానత్వమే ప్రగతికి మూలమని వారు అన్నారు. ఇదే నినాదంతో మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి ఏటా జరుపుకుంటున్నామని తెలిపారు. సమాజంలో మహిళలు ఆత్మగౌరవంతో స్వశక్తితో తమ ఆర్థిక అవసరాలను తామే తీర్చుకోగలిగే నిరంతర జీవనాధారాలు అవకాశాలు తామే నిర్మించుకోగలిగే ఉన్నత స్థితికి చేరుకోని స్త్రీ శక్తి ఎంతో ప్రపంచానికి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉన్నారన్నారు. మహిళలను చిన్న చూడడం నేటికీ జరుగుతూ ఉందని ఈ వివక్షను ఎదురుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మహిళలు అన్ని రంగాలలో ఎదగాలన్నారు. మహిళల సమస్యల పరిష్కారం కోసం మహిళలంతా ఏకమై సమస్యలు పరిష్కారం కోసం కృషి చేద్దామని ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎల్‌ఐసి మహిళా ఉద్యోగులు ఎస్.ప్రవీణ, సౌజన్య, రమాదేవి, లక్ష్మమ్మ, వి.పద్మ, ఎస్.పద్మ, జిల్లా కౌలు రైతు సంఘం నాయకులు గంటా లక్ష్మీపతి, ప్రజా గాయకుడు గద్దర్ బాబు, తదితరులు పాల్గొన్నారు.










