Mar 08,2023 21:54

మాట్లాడుతున్న మహిళా ఉద్యోగి

మాట్లాడుతున్న మహిళా ఉద్యోగి
సంపూర్ణ మహిళా సాధికారత వైపు అడుగులు
నెల్లూరు:మహిళా సమానత కోసం సృజనాత్మకత.. సాంకేతికత అన్న స్పూర్తితో మహిళలు పురుషులతో సమానంగా సామాజిక గౌరవాన్ని పొందుతూ సమాన అవకాశాలతో సంపూర్ణ మహిళా సాధికారత వైపు ఏపి అడుగులు వేస్తుందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. బుధవారం ఏపిజిఈఎ మహిళా విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. మహిళా విభాగం జిల్లా చైర్మన్‌ విజయనిర్మల, కన్వీనర్‌ జె.సుజాతాబాయి నిర్వహణలో చేపట్టిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా కోవూరు ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి వై జె పద్మశ్రీ ,వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్‌ దివ్య ప్రత్యూషలు హాజరుకాగా విశిష్ట అతిధులుగా ఏపిజిఈఎ రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు ఆర్‌ సులోచన హాజరైయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆధునిక సాంకేతికత యొక్క ప్రయోజనాలు మహిళల ఉపాధికి సాఫ్ట్వేర్‌ అవకాశాల నుండి మహిళల భద్రత కు నిర్భయ యాప్‌ వరకు అనేకం ఉన్నాయని, అలాగే మహిళలలో సహజంగా ఉన్న సజన వారి అభివద్ధికి ఉపయోగపడేలా మెరుగుచేసుకుంటున్నారన్నారు. అనంతరం లెమన్‌ స్పూన్‌ , అంత్యాక్షరి లాంటి ఆటల పోటీలలో మహిళా ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం కార్యక్రమం అతిథులు విజేతలకు బహుమతులు అందజేశారు. ఏపిజిఈఎ జిల్లా అధ్యక్ష కార్యదర్శి లు వై రమణారెడ్డి వై మల్లిజార్జున ల నేతత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా మహిళావిభాగం కోశాధికారి దేవసేన, మహిళావిభాగం కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.