Mar 11,2023 18:46

ఐఎమ్‌ఆర్‌ కళాశాలకు బహుకరించిన సిమెంటు బల్లలు

ప్రజాశక్తి -కందుకూరు : స్థానిక టిఆర్‌ఆర్‌ ప్రభుత్వ డీగ్రీ కళాశాలకు విశ్రాంత ప్రధానోపాధ్యాయులు విప్పగుంట మల్లికార్జున్‌రావు నాలుగు సిమెంట్‌ బల్లలను శనివారం బహుకరించారు. కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ రవికుమార్‌ మాట్లాడుతూ జాతీయ అవార్డు గ్రహీత విప్పగుంట మల్లికార్జున్‌ రావు ఎప్పటి నుంచో కళాశాల అభివద్ధి కోసం మంచి సలహాలతో పాటు, తన వంతు సహాయ సహకారాలు అందజేస్తున్నారని తెలిపారు. ఇప్పుడు కళాశాలకు నాలుగు సిమెంట్‌ బల్లలను అందజేశారని, వారికి కళాశాల తరఫున, కళాశాల విద్యార్థుల తరఫున ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో కళాశాలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తారని ప్రిన్సిపల్‌ డాక్టర్‌ రవికుమార్‌ ఆకాంక్షించారు. నాక్‌ సాధన కమిటీ సభ్యులు మంచి రాజు మురళీమోహన్‌ ఐఎంఆర్‌ సేవలను అభినందించారు.