ప్రజాశక్తి-వీరులపాడు
జుజ్జూరు గ్రామంలో రోడ్లను మరమ్మతు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం టిడిపి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మధిర-కంచికచర్ల రోడ్డును పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ గత సంవత్సరం కాలంలో రోడ్లన్నీ బాగు చేయాలని కోరుతూ తెలుగుదేశం శాసనసభ బృందం గ్రామాన్ని పరిశీలిస్తే కార్యకర్తలు, నాయకులపై వైసిపి దాడికి పాల్పడిందని, అయినా రోడ్లు వేయలేకపోయారని అన్నారు. నందిగామలోని పలు గ్రామాల నుండి ఇసుకను అర్ధరాత్రి హైదరాబాద్‌కు తరలిస్తూ ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నార్నఆ్నరు. తక్షణమే మైనింగ్ అక్రమ రవాణా ఆపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కోగంటి బాబు, గురిజాల అజరు కుమార్, చీరాల భరత్‌రెడ్డి, ఎర్రగుంట కృష్ణారావు, తమ్మిశెట్టి వీరబాబు, కాపా రాంబాబు తదితరులు పాల్గొన్నారు.










