Mar 08,2023 21:49

ఫొటో : ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్న ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి

ప్రమాదవశాత్తు నేలకొరిగిన రథం
ప్రజాశక్తి-బిట్రగుంట : బ్రహ్మోత్సవాలలో మంగళవారం రాత్రి రథం పడిపోవడం ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన అని కావలి ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాల రథాన్ని బుధవారం మధ్యాహ్నం రెండు క్రేన్ల సహాయంతో రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌ రెడ్డి పర్యవేక్షణలో సరి చేశారు.
ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలు కళ్యాణం జరిగిన అనంతరం రథాన్ని గ్రామంలో తిప్పుతున్న సమయంలో రోడ్డు మలుపు దగ్గర ప్రమాదవశాత్తు రథం పొంగిందని ఇది ఎవరి తప్పిదం నిర్లక్ష్యం కాదని పేర్కొన్నారు. ఆయనతో ఆయన జగదీశ్‌ రెడ్డి, కావలి డిఎస్‌పి, రూరల్‌ సిఐ,పోలీస్‌ సిబ్బంది, అధికారులు, గ్రామస్తులు, ప్రభుత్వ ఉద్యోగ అధికారులు తదితరులున్నారు.