ఫొటో : ప్రచారం నిర్వహిస్తున్న నాయకులు
ప్రజాసంఘాల విస్తృత ప్రచారం
ప్రజాశక్తి-ఉదయగిరి : ప్రతి సమస్యపై పోరాడే పిడిఎఫ్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజా సంఘ నాయకులు విస్తృత ప్రచారం ముమ్మరం చేశారు. బుధవారం స్థానిక పట్టణంలో పట్టభద్రుల, ఉపాధ్యాయుల అభ్యర్థులను గెలిపించాలని ఓట్లను వారు అభ్యర్థించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుద్యోగ నిర్మూలన ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడుతూ నిర్భయంగా సమస్యలపై గళం విప్పే పిడిఎఫ్ ఎంఎల్‌సి పట్టభద్రుల అభ్యర్థి మీగడ వెంకటేశ్వర్లురెడ్డి, ఉపాధ్యాయ ఎంఎల్‌సి అభ్యర్థి పొక్కిరెడ్డి బాబురెడ్డిలను మొదటి ఓటు వేసి గెలిపించుకోవాలన్నారు. కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు కాకు వెంకటయ్య, ఫర్ధిన్ బాషా, వెంకటేశ్వర్లు, తదితర నాయకులు పాల్గొన్నారు.










