ఫొటో : ప్రచారం నిర్వహిస్తున్న ప్రజాసంఘాల నాయకులు
పిడిఎఫ్ ఎంఎల్‌సి అభ్యర్థులను గెలిపించండి
ప్రజాశక్తి-ఆత్మకూరుఅర్బన్ : ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, ప్రయివేట్ టీచర్స్ పలు రంగాలలో విధులు నిర్వహిస్తున్న వారి సమస్యలు పరిష్కరించాలంటే పిడిఎఫ్ ఎంఎల్‌సి అభ్యర్థులను గెలిపించాలని ప్రజా సంఘాల నాయకులు షేక్ సంధాని, వాగాల శ్రీహరి, మోహన్ రెడ్డి బుధవారం ఆత్మకూరు పట్టణంలో పలు ప్రాంతాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం కరపత్రాలను ఓటర్లకు పంపిణీ చేశారు. మేధావులు, విద్యావంతులు, ఉద్యోగ, ఉపాధ్యాయులు, ఎంఎల్‌సి ఎన్నికలలో పిడిఎఫ్ ఎంఎల్‌సి అభ్యర్థులు పట్టభద్రుల అభ్యర్థి మీగడ వెంకటేశ్వర్లు రెడ్డి, ఉపాధ్యాయ అభ్యర్థి పొక్కిరెడ్డి బాబురెడ్డిలకు ఓట్లు వేసి గెలిపిస్తే శాసనమండలలో సమస్యలపై పరిష్కరించే దిశగా కృషి చేస్తారని ఓటర్లను అభ్యర్థించారు.










