పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేస్తున్న దృశ్యం
ప్రజాశక్తి -కందుకూరు : చేయి చేయి కలుపుదాం ఆపదలో ఉన్న వారిని ఆదుకుందాం అనే నినాదం తో శ్రీరామ సాయిబాబా వెల్ఫేర్ సొసైటీ కందుకూరు వారు నిరుపేదలకు అండగా నిలుస్తున్నారు. శనివారం నలదలపూరు ఎస్‌సి కాలనీకి చెందిన ఇద్దరి వద్ధురాళ్ల కుటుంబాలకు రెండు నెలలకు సరిపడా బియ్యం, సరుకులను అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం మీడియా చైర్మన్ చక్కా వెంకట కేశవరావు మాట్లాడారు. శ్రీరామ సాయిబాబా వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు రవ్వా శ్రీనివాసులు, దువ్వూరి స్వామి దాసు పాల్గొన్నారు.










