Jul 26,2022 14:30

ప్రజాశక్తి-విజయవాడ : దుర్గపురం 27వ డివిజన్లో  గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డిప్యూటీ మేయర్ శైలజా రెడ్డి , స్థానిక కార్పొరేటర్ కొండాయిగుంట మల్లీశ్వరి బలరాం పాల్గొన్నారు. గటప గడప మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల బాగోగులు తెలుసుకుంటున్నామని అన్నారు. స్థానికంగా ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని తెలిపారు. గత చంద్రబాబు పరిపాలన సమయంలో పేద ప్రజలకు ఏం చేశాడో చెప్పగలరా...? అని ప్రశ్నించారు. తాము చేసింది ప్రతి గడపకు వెళ్లి చెప్పకోగలుతున్నామని అన్నారు. చంద్రబాబు, సోము వీర్రాజు, పవన్ కళ్యాణ్ ఏపీ అప్పుల్లో నంబర్ వన్ అని మొన్నటి వరకు ప్రచారం చేశారని, రాష్ట్రాల అప్పుల జాబితాలో బీజేపీ పాలించే రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నాయని నిన్న కేంద్రమే తెలిపిందని అన్నారు. దీనిపై బీజేపీ నేత సోము వీర్రాజు ఏమి సమాధానం చెప్తారు..? ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, సోము వీర్రాజుకు పోలవరంపై మాట్లాడరం సిగ్గు పడాలని అన్నారు. పోలవరం పాపం చంద్రబాబుదేనని అన్నారు. పోలవరం ఆలస్యం అవ్వటానికి కారణం చంద్రబాబుదేనని  ఆగ్రహించారు. అస్తవ్యస్తంగా ఉన్న పోలవరం ప్రాజెక్ట్ ను సీఎం జగన్ ప్రభుత్వం గాడిలోకి తీసుకొస్తుందన్నారు.