- అభివృద్ధి మాటున ప్రజా సంపద దోపిడీ
ప్రజాశక్తి-మైలవరం: గ్రామాల అభివృద్ధి మాటున విలువైన సహజ సంపదను యథేచ్చగా దోపిడీ చేస్తున్నారు. మండలంలోని గణపవరం ప్రధాన రహదారి పక్కన గణపతి గట్టు చుట్టూ గత మూడేళ్లుగా గ్రావెల్ తవ్వుతున్నారు. రహదారుల అభివృద్ధి నిమిత్తం అంటూ అక్రమ తవ్వకాలు చేపట్టారు. గత నాలుగు రోజులుగా రాత్రి, పగలు ప్రొక్లెయిన్ సహాయంతో ట్రాక్టర్లతో గ్రావెల్‌ను తవ్వి ట్రక్కు రూ.600 నుంచి రూ.1200 వరకు విక్రయిస్తున్నారు. దీంతో పెద్ద కొండలు సైతం మాయమవుతున్నాయి. మాముళ్ల మత్తులో అధికారులు కన్నెతి చూడటం లేదన్న విమర్శలు వినపడుతున్నాయి. అధికారులు స్పందించి అక్రమ గ్రావెల్‌కు అట్టుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు. గ్రావెల్ అక్రమ తవ్వకాల గురించి తహశీల్దార్ ఎం.శ్రీనివాసరావును వివరణ అడగ్గా ఎలాంటి అనుమతులూ ఇవ్వలేదని తెలిపారు.










