Jul 30,2022 22:35

ప్రజాశక్తి-నందిగామ
నందిగామలో ఆత్మహత్యకు పాల్పడిన జాస్తి వర్షిణి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతోపాటు 25 లక్షల రూపాయల ఎక్స్‌్‌గ్రేషియోతోపాటు ఇవ్వాలని ఎస్‌ఎఫ్‌ఐ, సిఐటియు, కౌలురైతు సంఘం, ప్రజాసంఘాలు నాయకులు డిమాండ్‌ చేశారు. మండలం లోని కోడవటికల్లు గ్రామంలో నివాసం ఉంటున్న కుటుంబ సభ్యులను ప్రజాసంఘాల నాయకులు శని వారం కలిసి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు ఎం.సోమేశ్వ రరావు, ఎన్టీఆర్‌ జిల్లా కౌలు రైతుసంఘం జిల్లా అధ్యక్షులు చనుమోలు సైదులు, సిఐటియు నందిగామ కార్యదర్శి కె.గోపాల్‌లు మాట్లాడుతూ బ్యాంక్‌ వారు రుణాలు వసూలు చేయమని వర్షిని ఇంటికి పంపించి వేధింపులు గురిచేసారనిఅన్నారు. ఫైనాన్స్‌ రికవరీ ఏజెంట్లు ఇంటికి వచ్చి మహిళలపట్ల అసభ్యంగా మాట్లాడటం ఏమిటని అన్నారు. అసభ్యకరంగా మాట్లాడిన వారిపై నిర్భయ చట్టం కింద కేసు కూడా నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థి కుటుంబానికి ప్ర్రభుత్వం 25లక్షల రూపాయల ఎక్స్‌్‌గ్రేషియోతోపాటు కుటుంబంలో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు. ఇలాంటి ఘటనలు పున రావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవా లన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నందిగామ డివిజన్‌ కార్యదర్శి గోపి నాయక్‌ ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు వంశీ, ఆదిత్య చైతన్య కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.