కలకడ : క్షయవ్యాధి గ్రస్తులకు పౌష్టికాహారం పంపిణీ చేసినట్లు ఎర్రకోటపల్లి వైద్యాధికారి కిషోర్ కుమార్ రెడ్డి తెలిపారు. మండలంలోని ఎర్రకోటపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వార ప్రధానమంత్రి టిబి ముఖ్త భారత్ పోషణ మిత్ర కార్యక్రమంలో భాగంగా, మెడికల్ ఆఫీసర్ కిషోర్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో టిబి రోగులకు పౌష్టికాహారం కిట్లను పంపిణీ చేశారు.రోగులు క్రమం తప్పకుండా డాక్టర్ల పర్యవేక్షణలో వారు సూచించిన మేరకు చికిత్సలు పొందాలన్నారు. ఒక్కొక్క టిబి వ్యాధిగ్రస్తుడికి సుమారు రూ.700 పైచిలుకు విలువగల పౌష్టికాహార వస్తువులను అందించడం అభినందనీయమని అన్నారు. ఈ పౌష్టికాహారంతో పాటు మందులను కూడా క్రమం తప్పకుండా తీసుకున్నట్లయితే ఆరు నెలలకే క్షయ వ్యాధి పూర్తిగా తగ్గిపోతుందని అన్నారు. వైద్యులు కిషోర్ కుమార్ రెడ్డి, జవహర్ బాబు పంచాయితీ ప్రజలకు క్షయ వ్యాధిపై అవగాహన కల్పించారు. ప్రజలకు క్షయవ్యాధి లక్షణాలను, వాటికి తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి వివరించారు. కార్యక్రమంలో ఎంపిహెచ్‌ఇఒ జయరామయ్య, ఎంపిహెచ్‌ఎస్ ముజీబ్ బాషా, బి.రెడ్డమ్మ, టిబి యూనిట్ వైద్య సిబ్బంది ఎంపిహెచ్‌ఎస్ మురళి, సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ వై నాగిరెడ్డి, స్టాఫ్ నర్స్ భారతి, ల్యాబ్ టెక్షన్ జమీల, అహమ్మద్ ఆరోగ్య కార్యకర్త వాణి, ఎం ఎల్ హెచ్‌ఎస్ శ్వని, గోపికష్ణ, కనకమ్మ రాజసులోచన, లావణ్య, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.










