ప్రమాణకం చేస్తున్న ఉద్యోగులు
కృష్ణపట్నం పోర్టులో భద్రతా వారోత్సవాలు
నెల్లూరు :ఆదాని కష్ణపట్నం పోర్ట్ ఉద్యోగులు కార్మికులు ఎల్లప్పుడూ భద్రతతో మెలగాలని ఆదాని కష్ణపట్నం పోర్టు సి ఓ ఓ సంజరు కొత్త పేర్కొన్నారు. ఆదాని కష్ణపట్నం పోర్టులో భద్రతా వారోత్సవాల్లో భాగంగా బుధవారం నిర్వహించిన ర్యాలీని ఆయన జండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భద్రత వారోత్సవాలలో మాత్రమే భద్రత గా ఉండడం కాదని ఎల్లవేళలా భద్రతతో మెలగాలని ఆయన ఉద్యోగులకు కార్మికులకు సూచించారు. అదాని కష్ణపట్నం పోర్టులో భద్రతతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. భద్రతా వారోత్సవాల ఐదు కిలోమీటర్ల ర్యాలీలో ఉద్యోగులు కార్మికులు ఉత్సాహంగా పాల్గొన్నారు .ప్రతి ఒక్కరూ భద్రతా చర్యలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో అడ్మిన్ హెడ్ గణేష్ శర్మ సేఫ్టీ హెడ్ రామకష్ణ వివిధ విభాగాల హెచ్ ఓ డి లు ఉద్యోగులు పాల్గొన్నారు.










