ప్రజాశక్తి-విజయవాడఅర్బన్: రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో కృష్ణాజిల్లా క్రీడాకారులు ఒక రజతం, మూడు కాంస్య పతకాలు సాధించారని జిల్లా శిక్షకుడు ధనియాల నాగరాజు తెలిపారు, ఆదివారం ప్రకాశం జిల్లా ఒంగోలు ఆచార్య రంగా భవన్‌లో ఆంధ్రప్రదేశ్ అంతర్ జిల్లాల అండర్-10, అండర్-12 బాలబాలికల ఫెన్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలు జరిగాయని తెలిపారు, ఈ పోటీలకు ఉమ్మడి కృష్ణాజిల్లా నుంచి హాజరైన సెయింట్ ఫ్రాన్సిస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ మచిలీపట్నంలో 5వ తరగతి చదువుతున్న కైలు తారక రుత్విక్ అండర్-10 శాబర్ విభాగంలో రజిత పతకం సాధించినట్లు నాగరాజు తెలిపారు. అండర్-10 శాబర్ విభాగంలో జడ్‌పి హైస్కూల్ గూడూరులో 5వ తరగతి విద్యార్థిని నిమ్మగడ్డ ప్రియ దర్శిని, అండర్-10 ఇప్పి విభాగంలో ఇబ్రహీంపట్నం డిఎవి స్కూల్‌లో 3వ తరగతి చదువుతున్న గింజాల విజ్ఞరు, అండర్-12 శాబర్ విభాగంలో సెయింట్ ప్రాన్సిస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ మచిలీపట్నంలో 7వ తరగతి చదువుతున్న బలిరెడ్డి శ్యాం కాంస్య పతకాలు సాధించినట్లు ధనియాల నాగరాజు తెలిపారు. జట్టు మేనేజర్ నక్కా దేవశేషును రాష్ట్ర ఫెన్సింగ్ సంఘం అధ్యక్ష కార్యదర్శులు నాగేశ్వరరావు, కృష్ణ మోహన్, ఉపాధ్యక్షులు నాగం సతీష్‌బాబు అభినందించారు.










