Mar 08,2023 21:50

జెండా ఊపి ప్రారంభిస్తున్న కెవిఎన్‌ కిరణ్మయి

జెండా ఊపి ప్రారంభిస్తున్న కెవిఎన్‌ కిరణ్మయి
క్రీడలతో మానసికోల్లాసం
నెల్లూరు:మహిళలు కుటుంబ వ్యవహారం, విధి నిర్వహణలో తీవ్రమైన మానసిక వత్తిడిలకు గురౌతుంటారని, వాటిని అధిగమించేందుకు, మానసిక ఉల్లాసంతో ఆరోగ్యంగా జీవనం సాగించేందుకు క్రీడా పోటీలు ఎంతో దోహదపడుతాయని కలెక్టర్‌ సతీమణి కెవిఎన్‌ కిరణ్మయి చక్రధర్‌ పేర్కొన్నారు. బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎన్‌జిఓ భవన్‌లో క్రీడా పోటీలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులనుద్ధేశించి ఆమె మాట్లాడుతూ మహిళా ఉద్యోగులు తమ విధి నిర్వహణ సమయంలో, కుటుంబ వ్యవహారాలతో ఎంతో వత్తిడికి గురౌతుంటారని, అటువంటి వారి కొరకు ఆటవిడుపుగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు.
ఈ కార్యక్రమం ఏపీ యన్‌ జీ ఓస్‌ అసోసియేషన్‌ మహిళా విభాగం జిల్లా చైర్‌ పర్సన్‌ యు.చిన్నమ్మ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిధులుగా కమిషనర్‌ డి.హరిత, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా యం.పెంచలయ్య ,డిఆర్‌ఓ సి.వెంకటనారాయణమ్మ ,ఐసిడిఎస్‌ పిడి కె.సౌజన్య , డిఈఒ ఆర్‌ యస్‌ గంగా భవాని, ఐటిడిఏ పిడి యం.రాణి , డ్వామా ఏపిఓ టి.వసుంధర ,రాష్ట్ర వైస్‌ చైర్‌ పర్సన్‌ కే.స్వర్ణలత, కన్వీనర్‌ ఏ వీ యస్‌ శారద,జిల్లా యన్‌ జి ఓ అధ్యక్ష కార్యదర్శులు మన్నేపల్లి. పెంచలరావు, నాయుడు. వెంకటస్వామి కోశాధికారి బండారుపల్లి. వెంకటేశ్వర్లు, అసోసియేట్‌ అధ్యక్షులు నందిమండలం. ఆంజనేయ వర్మ,ఆర్గనైజింగ్‌ కార్యదర్శి గాదిరాజు. రామకష్ణ, ఉపాధ్యక్షులు ఈదూరు.కరుణమ్మ,నల్లగొండ మధు,కష్ణంరాజు, యస్‌.శ్రీధర్‌, కష్ణ కుమార్‌,సంయుక్త కార్యదర్శులు కడెం రాజేంద్రప్రసాద్‌, లక్కాకుల. పెంచలయ్య, మహిళా సంయుక్త కార్యదర్శి జి.సువర్ణ, నగర అధ్యక్ష కార్యదర్శులు చిలకా.రామకష్ణారెడ్డి, డేగల.మార్కండేయులు, అధిక సంఖ్యలో మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.
మొదటి రోజు విజేతలు వీరే..
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మొదటి రోజు రంగవల్లులు, వ్యాసరచన,వక్తృత్వం,పాటలు,నృత్య విభాగాల్లో పోటీలు నిర్వహించారు. రంగవల్లులు పోటీలల్లో వైద్యవిభాగం నుంచి ఎన్‌.వనజ, జెట్‌పివిభాగం నుంచి టివిఎన్‌ ప్రసన్న, ఇరిగేషన్‌ విభాగం నుంచి బి.శ్రీజలు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను కైవసం చేసుకున్నారు. వ్యాసరచన విభాగంలో మెడికల్‌ విభాగం నుంచి అనీల, జెడ్‌పి విభాగం నుంచి ఏ.హైమావతి, మెడికల్‌ విభాగం నుంచి జి.గీతావాణిలు వరుసగా ప్రథమ,ద్వితీయ, తృతీయ బహుమతులు అందుకున్నారు. ఇరిగేషన్‌ విభాగం నుంచి ఎస్‌.అరుణ, వైద్య విభాగం నుంచి ఆర్‌కె మంజుల, జెడ్‌పి నుంచి కే.ఆదిలక్ష్మిలు వక్తృత్వం పోటీలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను సొంతం చేసుకున్నారు. పాటల పోటీలల్లో ఐసిడిఎస్‌ విభాగం నుంచి ఆర్‌ .శుభరత్నమ్మ, మెడికల్‌ విభాగం నుంచి సిహెచ్‌ హైమావతి, ఆశా కార్యకర్త పి.అరుణకుమారిలు ప్రతిభను కనపరిచారు. నృత్య పోటీలల్లో జడ్‌పి విభాగం నుంచి మృదుల, మెడికల్‌ విభాగం నుంచి పి.లలిత, వెంకమ్మలు వరుసగా ప్రథమ,ద్వితీయ , తృతీయ బహుమతులు అందుకున్నారు. నత్యం లో గొప్ప ప్రదర్శన ఇచ్చిన చిట్టెమ్మ మెడికల్‌ వారికి స్పెషల్‌ బహుమతి అందజేశారు. టగ్‌ ఆఫ్‌ వార్‌ విభాగంలో ఇరిగేషన్‌ శాఖ నుంచి ఎస్‌.అరుణ టీం సభ్యులకు మొదటి బహుమతి, రన్నర్‌గా నిలిచిన జె.సుజాత టీం సభ్యులకు ద్వితీయ బహుమతులు అందజేశారు.