ప్రజాశక్తి-విజయవాడఅర్బన్
నిర్మాణ రంగంలో ఉన్న అన్ని అంశాలను ఒకేచోటకు చేర్చడం క్రెడారుకి మత్రమే సాధ్యమని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటి జనరల్ మేనేజర్ రంగరాజన్ పెర్కొన్నారు. శుక్రవారం నోవాటెల్ హొటల్‌లో క్రెడారు ప్రాపర్టీ షో- 2022 బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఎస్‌బీఐ డీజీఎం రంగరాజన్ హాజరై బ్రొచర్ ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సమావేశానికి క్రెడారు విజయవాడ ప్రధాన కార్యదర్శి రమేష్ అంకినీడు అద్యక్షత వహించారు. ఎస్‌బీఐ డీజీఎం రంగరాజన్ మాట్లడుతూ.. నిర్మాణ రంగంలో ఉన్న అనేకమంది మేధావుల సమూహం క్రెడారు ఆన్నారు. ప్రతి ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా క్రెడారు విజయవాడ ప్రాపర్టీ షోకు సిద్దమవడం సంతోషదాయకమన్నారు. వినియోగదారుల నిర్మాణ అవసరాలన్నీ ఒక్క చోటకు చేర్చి సేవలందించడం ఒక గొప్ప విషయమన్నారు. ప్రాపర్టీ షోను ఎలా నిర్వహించాలో క్రెడారు దగ్గర నేర్చుకోవాలని, వినియోగదారులు ఈ సౌకర్యాన్ని సద్వినియొగం చేసుకోవాలని కోరారు. క్రెడారు ప్రాపర్టీ షోలో పాల్గోనే నిర్మాణ రంగ సంస్థలు కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకుని వినియోగదారులకు సేవ చేయాలని సూచించారు. క్రెడారు విజయవాడ విభాగం అధ్యక్షుడు కె.రాజేంద్ర మాట్లాడుతూ.. ఈ ఏడాది కూడా క్రెడారు 8వ ప్రాపర్టీ షో అక్టోబర్ 1, 2 తేదీల్లో నగరంలోని ఏ కన్వెన్షన్‌లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వినియోగదారులు ఈ అద్బుత అవకాశాన్ని సద్వినియొగం చేసుకోవాలని సూచించారు. క్రెడారు ప్రాపర్టీ షో కన్వినర్ దాసరి రాంబాబు ప్రాపర్టీ షో నిర్వహణ వివరాలను వెల్లడించారు. కార్యక్రమంలో క్రెడారు ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రసిడెంట్ వై.వి.రమణరావు, క్రెడారు విజయవాడ ఉపాధ్యక్షుడు కె.వి.వి.రవికుమార్, కె.తేజేశ్వరరావు, ట్రెజరర్ వి.శ్రీధర్, జాయింట్ సెక్రటరీలు బి.కేశవచంద్ర, టి.వంశీకష్ణ, తదితరులు పాల్గొన్నారు.










