- సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌సిహెచ్ శ్రీనివాస్
ప్రజాశక్తి-జగ్గయ్యపేట రూరల్: మున్సిపల్, ఇంజనీరింగ్ వాటర్ వర్క్స్ తదితర కార్మికులకు హెల్త్ అలవెన్సు ఇవ్వాలని సిఐటియు ఎన్‌టిఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌సిహెచ్ శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం జగ్గయ్యపేట మున్సిపల్ కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే మున్సిపల్ కార్మికుల సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీల మినిట్స్ కాపీ విడుదల చేయాలని కోరారు. మున్సిపాలిటీల్లో అనేక రకాల పనులు చేస్తున్న వారందరికీ హెల్త్ అలవెన్సు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం, పర్మినెంట్ కోసం రాబోయే కాలంలో బలంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిఐటియు మండల అధ్యక్షుడు షేక్ గౌస్‌మియ, నాయకులు ఎస్ రామనాధం, యూనియన్ అధ్యక్షురాలు పారా యలకమ్మ, కంది రంగమ్మ, కె.విజయకుమార్, సతీష్, సమాధానం, బుజ్జి, ఇంజనీరింగ్ వాటర్ వర్క్స్ కార్మికుల నాయకులు శ్రీనివాసరావు, నాగులు తదితరులు పాల్గొన్నారు.










