ప్రజాశక్తి-భవానీపురం: 45వ డివిజన్‌లోని కబేళా నుంచి కొంతమేర దుర్వాసన వస్తోందని స్థానికుల తమ దృష్టికి తీసుకవచ్చారని, ఆ మేరకు హైజెనిక్ కబేళాగా అభివృద్ధిపరిచేందుకు కృషి చేస్తానని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. 137వ సచివాలయం పరిధిలో 56వ రోజు మంగళవారం గడపగడపకు మన ప్రభ్యుత్వం కార్యక్రమం జరిగింది. మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీ రూహుల్లా, 45వ డివిజన్ కార్పొరేటర్ మైలవరపు మాధురి లావణ్యతో కలిసి వెలంపల్లి గడపగడపకు వెళ్లి ప్రజలకు ఈ మూడేళ్ల కాలంలో ప్రభుత్వ పరంగా జరిగిన సంక్షేమ పథకాలు వివరించారు. వర్షాకాలం కావడంతో కబేళాలో కొంత దుర్వాసన వస్తుందని స్థానికులు తెలిపారు. దోమల సమస్యను పరిష్కరిస్తామని, రోడ్లను అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు మైలవరపు కష్ణ, రాంబాబు, వాసు, సోషల్ వర్కర్ రాము, రమేష్, కట్టా సత్తి, పీతల నాగు, కష్ణారెడ్డి, మల్లిరెడ్డి పాల్గొన్నారు.
46వ డివిజన్‌లోని లంబాడీపేటలో అషాడమాసం సందర్భంగా లంబాడీల అధ్వర్యంలో మంగళవారం శ్రీ ముత్యాలమ్మ శ్రీ కనకదుర్గ అమ్మవార్లకు బోనాల జాతరను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెలంపల్లి శ్రీనివాసరావు, రాయన భాగ్యలక్ష్మి, నరేంద్ర పాల్గొన్నారు.










