ప్రజాశక్తి- నందిగామ
మాజీ హౌంమంత్రి వసంత నాగేశ్వరరావు 76వ జన్మదిన వేడుకలు శుక్రవారం ఐతవరంలో తన స్వగహంలో ఘనంగా జరిగాయి. వసంత నాగేశ్వరరావు కుమారులు, మైలవరం శాసన సభ్యులు వసంత వెంకట కష్ణప్రసాద్, శిరీష, కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, అభిమానుల సమక్షంలో వసంత నాగేశ్వరరావు కేకును కట్ చేశారు. వసంత నాగేశ్వరరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, ఆశీర్వచనాలు తీసుకున్నారు. అలాగే ఎంఎల్‌సి మొండితోక అరుణ్ కుమార్ మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావును ఐతవరంలో కలిసి పుష్పగుచ్ఛం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.










