Jul 24,2022 22:23

ప్రజాశక్తి-గంపలగూడెం: ఎంతోమందికి భవిష్యత్తునిచ్చిన పాఠశాలను యధాతధంగా కొనసాగించేందుకు పూర్వ విద్యార్థులతో పాటు ఔత్సాహిక దాతలు కూడా ముందుకు రావాలని వికాస్‌ విద్యాసంస్థల అధినేత నరెడ్ల నర్సిరెడ్డి కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఎయిడెడ్‌ విద్యాసంస్థలను రద్దు చేసిన నేపథ్యంలో అమ్మిరెడ్డిగూడెం ఎబిఎం హైస్కూల్లో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తును కాపాడే దానిలో భాగంగా ఆదివారం పాఠశాల ఆవరణలో పూర్వ విద్యార్థుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నర్సిరెడ్డి మాట్లాడుతూ తగిన వనరులను సమకూర్చి పాఠశాలను నిలబెట్టేందుకు సమిష్టి సహకారం అవసరమన్నారు. ఈ సందర్భంగా స్కూల్‌ వెల్ఫేర్‌ సొసైటీ పలు తీర్మానాలు ప్రవేశపెట్టింది.అధ్యక్షతన జరిగినసాధారణ సమావేశంలో పాఠశాలకు ఉన్న స్థలంతో పాటు అనుబంధంగా ఎకరా భూమిని కొనుగోలు చేసి ప్రభుత్వానికి అప్పగించడం, ఇద్దరి పేర్లతో గంపలగూడెం ఎస్‌బిఐలో అకౌంట్‌ ఏర్పాటు చేయడం, పాఠశాలను యధాతధంగా కొనసాగించడం, పాఠశాలలో విద్యాబోధన చేస్తున్న వాలంటరీలకు గౌరవ వేతనం సేకరించిన నిధి నుండి చెల్లించడం తదితర తీర్మానాలను స్కూల్‌ వెల్ఫేర్‌ సొసైటీ ప్రవేశపెట్టగా ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంతి ఉపాధ్యాయులు బిజెపి సుందర్‌రావు, ఎస్‌.మల్లికార్జునరావు, ఎం.ఉమామహేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.