ప్రజాశక్తి-నందిగామ
ఫైనాన్స్ రికవరీ ఏజెంట్లు వేధింపులు తట్టుకోలేక నందిగామలో ఆత్మహత్యకు పాల్పడిన ఇంటర్ విద్యార్థిని జాస్తి హరిత వర్షిని కుటుంబానికి ప్రభుత్వం 25లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చనుమోలు సైదులు, నందిగామ టౌన్ కార్యదర్శి కటారపు గోపాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం నందిగామ సుందరయ్య భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నందిగామ పట్టణంలో గురువారం నాడు ఇంటర్ విద్యార్థిని హరిత వర్షిని ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిందని, దీనికి కారణం ఎస్‌బిఐ క్రెడిట్ కార్డ్ రుణాలు తీసుకోవడం వల్ల ఈ సంఘటన జరిగిందని విచారం వ్యక్తం చేశారు. ఫైనాన్స్ రికవరీ ఏజెంట్లు బాలిక తల్లిదండ్రుల పట్ల పట్ల అసభ్యంగా మాట్లాడటంతో విద్యార్థిని మనస్థాపానికి గురై మానసికంగా కంగిపోయి, హరిత వర్షిని ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడిందని తెలిపారు. హరిత వర్షిని ఆత్మహత్యకు కారుకులైన ఫైనాన్సు ఏజెంట్ల పై కఠినంగా కేసులు నమోదు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. విద్యార్థిని కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలబడి 25లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియో ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు శ్రీనివాస్,ఎస్‌ఎఫ్‌ఐ నందిగామ డివిజన్ కార్యదర్శి గోపి నాయక్, నాయకులు పాల్గొన్నారు.
బాలిక ఆత్మహత్య కేసులో దర్యాప్తు ముమ్మరం
బ్యాంకు ఫైనాన్స్ ఏజెంట్లు మానసిక వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన ఇంటర్ విద్యార్థిని జాస్తి హర్షిత వర్షిని ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. బాలిక పట్ల. విద్యార్థిని తల్లిదండ్రుల పట్ల అసభ్యంగా మాట్లాడిన నలుగురు ఫైనాన్స్ ఏజెంట్లపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఈనెల 28వ తేదీ తెల్లవారుజామున ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న నందిగామకు చెందిన జాస్తి హరితవర్షిని ఆత్మహత్య సంఘటన సంచలనంగా మారింది. బ్యాంకు ఫైనాన్స్ ఏజెంట్లు మానసిక వేధింపుల వల్ల తమ కుమార్తె ఆత్మ చేసుకుందని బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు నలుగురు రికవరీ ఏజెంట్ లపై కేసు నమోదు చేశారు.










