ప్రజాశక్తి-భవానీపురం
స్థానిక 45వ డివిజన్137వ సచివాలయం పరిధిలో సోమవారం గడపగడపకు మన ప్రభ్యుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు, స్థానిక కార్పొరేటర్ మాధురి లావణ్య, మైలవరపు కృష్ణ గడపగడపకు వెళ్లి ప్రజలకు ఈ మూడేళ్ల కాలంలో ప్రభుత్వ పరంగా జరిగిన సంక్షేమ పథకాల వివరాలు తెలియచేస్తూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వెలంపల్లి మాట్లాడుతూ అర్హత ఉన్న అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు తెలిపారు. 26 జిల్లాలు అభివృద్ధి చెందేలా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో 45వ డివిజన్ వైసిపి నాయకులు రాంబాబు, వాసు, సోషల్ వర్కర్ రాము, రమేష్, కట్టా సత్తి, పీతల నాగు, కృష్ణారెడ్డి, మల్లిరెడ్డి, పి.ప్రసాద్ పాల్గొన్నారు.










