ప్రజాశక్తి- నెల్లూరు రూరల్ : పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి మీగడ వెంకటేశ్వర రెడ్డి, టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి పోక్కిరెడ్డి బాబురెడ్డి గెలింపించాలని కోరుతూ.. 30 వ డివిజన్ డాక్టర్ రామచంద్రారెడ్డి నగర్‌లో శుక్రవారం ఉదయం సిపిఎం నాయకులు ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రూరల్ కార్యదర్శి బత్తల కష్ణయ్య సిపిఎం రూరల్ సెక్రటేరియట్ సభ్యులు కొండా ప్రసాద్ సిపిఎం రూరల్ కమిటీ సభ్యులు కండె కోటేశ్వరరావు, శాఖ కార్యదర్శి చెరుకూరి హజరత్తయ్య కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.










