Jul 28,2022 09:34

ప్రజాశక్తి - మైలవరం (ఎన్‌టిఆర్‌జిల్లా) : ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎస్వీఎస్ నగర్ లో కలకలంరేగింది. ఎస్‌విఎస్‌ నగర్‌లో నివాసం ఉంటున్న శ్రీరామ్‌ వెంకటనరసింహమూర్తికి చెందిన ఆటోను గుర్తు తెలియని దుండగులు నిప్పంటించారు. వివరాల ప్రకారం.. నిన్న అర్థరాత్రి సమయంలో కిరాయికి వెళ్ళి వచ్చి రాత్రి ఆటో ఇంటి బయట పార్క్ చేశాడు. తెల్లారే సరికి ఆటో కాలిపోయి ఉండడంతో బ్రతుకుతెరువు కోల్పోయిన ఆటో ఓనర్ లబోదిపోమంటున్నాడు.ఈ ఘటనపై ఆటో యజమాని పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.