అధికారమైనా పగైనా
వెనుకనున్న కారణమేదైనా
యుద్ధమెపుడూ అనర్ధమే
అనివార్యంగా చేసినా
అచేతనంగా పాల్లొన్నా
యుద్ధమెపుడూ అనర్ధమే
నిర్మించుకున్న బహుళ సౌధాలైనా
నిలబెట్టాలనుకున్న సంస్కృతియైనా
అరచేతిలో పెట్టుకున్న ప్రాణాలైనా
క్షణంలో మాయమవ్వడమే
గాలిలో కలవడమే యుద్ధమంటే
యుద్ధమంటే శ్మశానమే
కాలే శవాల మధ్య భోజనమే
ఓడిన వాడు ఓడానని ఏడిస్తే
గెలిచినవాడూ ఆ గెలుపెందుకో
అర్థం కాక తానూ ఏడుస్తాడు
ఆ రక్తపుకూడు ఆనందపరిచేదెవరినో
తమది న్యాయమని వాదించినా
యుద్ధమెపుడూ అన్యాయమే
సత్యాసత్యాల జిలుగులు దిద్దినా
యుద్ధానంతరం అంతా చీకటే
యుద్ధం చివరికి మిగిల్చేది
గాఢాంధకారమైన కాళరాత్రినే!
- జంధ్యాల రఘుబాబు
98497 53298










