Apr 01,2023 21:29

ఫొటో : టీకా కార్యక్రమాన్ని పరిశీలిస్తున్న కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌ రోస్‌లీన్‌

వ్యాధినిరోధక టీకాలు పంపిణీ
ప్రజాశక్తి-మర్రిపాడు : మండలంలోని పోలిరెడ్డిపల్లి వైఎస్‌ఆర్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ సెంటర్లో జరుగుతున్న వ్యాధి నిరోధక టీకా కార్యక్రమాన్ని కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌ రోస్‌లీన్‌ శనివారం పరిశీలించారు. టీకా కార్యక్రమం చేస్తున్న ఆరోగ్య సిబ్బందికి ఆమె పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గుంపులు గుంపులు ఉండకుండా తగుజాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఎండలు అధికంగా ఉన్న నేపథ్యంలో ఏమైనా పనులు ఉంటే ఉదయం 8 నుండి 11 గంటల్లోపు చూసుకోవాలని సూచించారు. ఎండ తీవ్రతకు వడదెబ్బల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకొని సురక్షితంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో ఎంఎల్‌హెచ్‌పిజి సాగర్‌ మేరీ, హెల్త్‌ అసిస్టెంట్‌ ఖాజా ముబారక్‌, ఎఎన్‌ఎం సుప్రియ, ఆశా కార్యకర్తలు భవాని, లక్ష్మీదేవి, తదితరులు పాల్గొన్నారు.