Feb 04,2023 22:28

అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌

పెనుకొండ : ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయించాలని కలెక్టర్‌ బసంత్‌ కుమార్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం పట్టణంలోని జగనన్న హౌసింగ్‌ లేఅవుట్‌ను కలెక్టర్‌ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు కింద జగనన్న హౌసింగ్‌ లే అవుట్లలో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు. పెనుకొండ పరిధిలో జగనన్న హౌసింగ్‌ లేఅవుట్లలో 1,915 ఇళ్లు మంజూరుకాగా 400 గృహ నిర్మాణాలు పూర్తి అయ్యాయన్నారు. మిగిలిన వాటిని వేగవంతం చేయించాలన్నారు. ఇళ్ల నిర్మాణాల్లో అలసత్వం వహిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్‌ ఈఈ చంద్రశేఖర్‌, డీఈ శంకర్‌లాల్‌, ఏఈ శ్రీనాథ్‌, ఎంపిడిఒ శివశంకరప్ప, తహశీల్దార్‌ స్వర్ణలత, మున్సిపల్‌ కమిషనర్‌ వంశీ, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.
చెన్నేకొత్తపల్లి : మండలంలోని మేడాపురం వద్దనున్న జగనన్న హౌసింగ్‌ లేవుట్లలో ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్‌ బసంత్‌కుమార్‌ ఆదేశించారు. ఈ మేరకు ఆయన శనివారం ఇళ్ల నిర్మాణాలను పరిశృలించారు. ఇళ్ల నిర్మాణంలో మరింత వేగం పెంచాలని, సంబంధిత లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్‌ ఈఈ చంద్రశేఖర్‌, డీఈ శంకర్‌లాల్‌, ఏఈ హరినాయక్‌, ఎంపిడిఒ అశోక్‌ నాయక్‌, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు, తదితరులు పాల్గొన్నారు.