మృతిచెందిన దృశ్యం
వడదెబ్బతో మాజీ సర్పంచ్
నాగూర్ సాహెబ్ మృతి
సీతారామపురం:మండలంలోని బసినేని పల్లి పంచాయతీ సిపిఎం మాజీ సర్పంచ్, ఎంపిటిసి మెంబరు అగ్నిగుండాల నాగూరుసాహెబ్ (69) మంగళవారం వడదెబ్బతో మృతిచెందారు. ప్రస్తుతం రైతు సంఘం డివిజన్ నాయకులుగా ఉన్నారు. వివరాలమేరకు.. పొలానికి నీళ్లు కడుతున్న సమయంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున వడదెబ్బ తగిలి కింద పడ్డాడు. దీంతో చుట్టుపక్కల పొలంలోని వారు వచ్చేలోపు చనిపోయి ఉన్నాడని స్థానికులు తెలిపారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. ఆయన మతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
సిపిఎం సంతాపం: నాగుర్‌సాహెబ్ మృతి పార్టీకి తీరనిలోటని సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ అన్నారు.నాగుర్‌సాహెబ్ పార్టీలో చురుగ్గా పనిచేసేవారని కొనియాడారు. పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేసేవారని తెలిపారు. మృతుని కుటుంబానికి సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్, జిల్లా కార్యదర్శివర్గసభ్యులు మాదాల వెంకటేశ్వర్లు, ఎం.మోహన్‌రావు, జొన్నలగడ్డ వెంకమరాజు, గోగుల శ్రీనివాసులు, తుళ్లూరు గోపాల్, కె.అజరుకుమార్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మూలెవెంగయ్య, అధ్యక్షులు పులిగండ్ల శ్రీరాములు, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చండ్ర రాజగోపాల్, ఉదయగిరి రైతు సంఘం నాయకులు కాకువెంకటయ్య, కోడే రమణయ్య, తదితరులు వారి కుటుంబానికి ప్రగాడ సానుభూతి తెలియజేశారు.నేడు మధ్యాహ్నం 3గంటలకు అంత్యక్రియలు జరుగునని కుటుంబ సభ్యులు తెలిపారు.










