ఉగ్రరూపం దాల్చిన సూరీడి నెత్తి మీద నుంచి
ఉష్ణ జలపాతం భూమ్మీదకు జారుతుంది
మా ఊరులో కాగుతున్న నదిలా
అది ఉరకలేస్తుంది
జనాలు దేహాలన్నీ చెమట బావులవుతున్నాయి
చుక్క నీటి కోసం,
చల్లని గాలి కౌగిలి కోసం
దేహలపై అణువులన్నీ
ఎడారి ఇసుక రేణువుల్లా ఎదురు చూస్తున్నాయి
- పి.శ్రీనివాస్ గౌడ్