టిడిపిపై విమర్శలు మానుకోండి
ప్రజాశక్తి-కావలి : ముస్లిం ఆస్తుల పరిరక్షణ గురించి కొంతమంది ముస్లిం నాయకులు టిడిపి నాయకులు ఆక్రమించుకున్నారని మాట్లాడడం శోచనీయమని, అక్రమాలకు సంబంధించిన వివరాలు తమవద్ద ఉన్నాయని తెలియజేయడం హాస్యాస్పదంగా ఉందని, టిడిపిపై బురదజల్లే ప్రయత్నాలు మానుకోవాలని పలువురు నాయకులు హితువు పలికారు. ఈ మేరకు ఆదివారం పార్టీ కార్యాలయంలో ఆదివారం ముస్లిం టిడిపి నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముస్లిం నేతలు మాట్లాడుతూ శనివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ముస్లిం సమాజానికి సంబంధించిన ఎలాంటి హక్కులకు భంగం కలిగినా వారితో తాము కూడా కలిసి పోరాటానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఆక్రమించింది ఎవరో.. అనే ఆధారాలతో వస్తే పార్టీతో సంబంధం లేకుండా తాము కూడా కలిసి మీతోటి మన ముస్లిం హక్కులను కాపాడుకోవడానికి పోరాటం చేస్తామన్నారు. ఆక్రమణలకు గురైన స్థలాల వివరాలతో పత్రికా ముఖంగా తెలియజేయవలసిందిగా కోరారు. పార్టీలో ఎవరి అభిప్రాయాలు వారివేనని మన ముస్లిం సామాజిక అభివృద్ధే అందరి ఆశయమని, ఇది గుర్తించి ముందుకు సాగాలని తెలిపారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ షేక్ మస్తాన్, జిల్లా మైనారిటీ ఉపాధ్యక్షులు షేక్ రఫీ అహ్మద్, పట్టణ మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి సయ్యద్ అబ్దుల్ హఫీజ్, పార్టీ సీనియర్ కార్యకర్త, మాజీ కౌన్సిలర్ మహమ్మద్ ఇనాయత్ హుస్సేన్, 40వ వార్డు అధ్యక్షులు షేక్ రఫీ అహ్మద్, టిఎన్‌టియుసి నియోజకవర్గ అధ్యక్షులు షేక్ నాగూర్ షరీఫ్, తదితరులు పాల్గొన్నారు.










