Apr 03,2023 19:43

టిడిపి కార్యకర్తలకు కండువాలు కప్పుతున్న ఇంటూరి నాగేశ్వరరావు

ప్రజాశక్తి -కందుకూరు :మండలంలోని ఉలవపాడుకు చెందిన 11 కుటుంబాల వారు ఆదివారం వైసిపిని వీడి టిడిపిలో చేరారు. ఉలవపాడుకు చెందిన వైసిపి నాయకుడు షేక్‌ ఖాదర్‌ బాషాతో పాటు మరో 10 కుటుంబాల వారు కందుకూరు నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావు సమక్షంలో టిడిపిలో చేరారు. నాగేశ్వర రావు వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కొత్తగా పార్టీలోకి వచ్చే వారిని అన్ని విధాలుగా అండ దండలు అందిస్తామన్నారు. వైసిపిలో ముస్లిములకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు.స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్ర మంలో ఆత్మకూరు మాజీ సర్పంచ్‌ అమరనేని రాములు, బొడ్డు ప్రసాద్‌, రాచగర్ల శివకుమార్‌, పార్టీ రాష్ట్ర బిసి సెల్‌ కార్యనిర్వాహక కార్యదర్శి చిలకపాటి మధు, రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి బెజవాడ ప్రసాద్‌, రాష్ట్ర వాణిజ్యవిభాగం కార్యనిర్వాహక కార్యదర్శి కూనం నరేంద్ర నెల్లూరు పార్లమెంట్‌ ఐ టి డి పి అధ్యక్షుడు షేక్‌ రసూల్‌, నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షుడు షేక్‌ మున్నా, నగళ్ల హరిబాబు, ఉలవపాడు మండల ఐటీడీపీ కోఆర్డినేటర్‌ మట్టేపు సురేంద్ర ఉన్నారు.