తేనెలొలుకు తెలుగు రా
తెలుగు భాష నేర్చు రా
అందమైన తెలుగు రా
అమ్మ భాష నేర్వ రా
పల్లెటూరి తెలుగు రా
స్వచ్ఛమైన పలుకురా
సామెతలు జాతీయాలు
జానపదాలు తెలవరా
తెలుగంటే పద్యమేరా
నన్నయ్యతో మొదలు రా
పాల్కురికి తెలుగు రా
పల్లెపలుకుల కావ్యంరా
శ్రీకృష్ణ దేవరాయల కాలంరా
తెలుగు శృంగారించుకొనెరా
ప్రబంధాలు వెలిసెరా
అందలమెక్కి నిలిచెరా
అన్నమయ్య సంకీర్తనరా
అచ్చతెలుగు ఆలపించెరా
త్యాగయ్య తెలుగు రా
పరభాషీయుల మెప్పురా
కందుకూరి గురజాడ శ్రీశ్రీలు రా
చైతన్యకాంతి పుంజాలు రా
జాషువా పద్యమై వెలిగెరా
గిడుగు వ్యవహారికమై నిలిచెరా
దేశవిదేశాల్లో తెలుగు రా
అక్షరమై నిలుస్తొందిరా
తెలుగు నేలపై తెలుగు రా
నేర్చుకోమని పిలుస్తొందిరా
- ఆవుల చక్రపాణి యాదవ్
99633 50973










