Mar 29,2023 20:53

మాట్లాడుతున్న రాష్ట్ర ప్లానింగ్‌ శాఖ కార్యదర్శి జి.ఎస్‌ ఆర్‌.కే.ఆర్‌. విజయ కుమార్‌

మాట్లాడుతున్న రాష్ట్ర ప్లానింగ్‌ శాఖ కార్యదర్శి జి.ఎస్‌ ఆర్‌.కే.ఆర్‌. విజయ కుమార్‌
సుస్థిర అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం
నెల్లూరు:మానవ అభివద్ది కోసం నిర్ధేశించిన సుస్థిర అభివద్ది లక్ష్యాల సాధనకు అన్నీ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం వుందని రాష్ట్ర ప్లానింగ్‌ శాఖ కార్యదర్శి జి.ఎస్‌ ఆర్‌.కే.ఆర్‌. విజయ కుమార్‌ పేర్కొన్నారు.బుధవారం స్థానిక శ్రీ వేంకటేశ్వర కస్తూరిభా కళాక్షేత్రంలో రాష్ట్ర ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో క్షేత్ర స్థాయి అధికారులతో సుస్థిర అభివద్ది లక్ష్యాల సాధనకు తీసుకోవాల్సిన చర్యలు, స్పందన పై వర్క్‌ షాప్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన రాష్ట్ర ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ కుమార్‌ మాట్లాడుతూ, ధనిక, పేదల మధ్య తీవ్రస్థాయిలో ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించేందుకు ఐక్యరాజ్య సమితి 2016-2030 మిలీనియం సమీకత అభివద్ధికి ప్రణాళిక సిద్ధం చేసిందన్నారు. అందులో బాగంగా పేదరికం, ఆకలి నివారించి ఆరోగ్యం, నాణ్యమైన విద్య, పరిశుభ్రమైన త్రాగునీరు అందించడం వంటి అంశాలతో కూడిన లక్ష్యాల సాధనకు ప్రపంచ వ్యాప్తంగా 8 అంశాలు, 18 లక్ష్యాలు, 56 సూచికలుతో ప్రణాళిక సిద్ధం చేశామన్నారు.
సుస్థిర అభివద్ధి లక్ష్యాల సాధనకు పేదరికం ప్రధాన అడ్డంకిగా మారిందని యునిసేఫ్‌ గుర్తించి, అందుకు అనుగుణంగా పలు ప్రతిపాదనలతో కూడి సూచికలు అందజేసిందన్నారు. ఏ పని ఎవరి కోసం చేస్తున్నాం, ఎందుకోసం చేస్తున్నాం అని ఆత్మావలోకనం చేసుకోవాలని, నిజమైన అభివద్ధికోసం పని చేస్తున్న అవకాశం వచ్చినందుకు అదష్టంగా భావించి ఇష్టంతో పని చేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. ముందుగా ఎస్‌.డి.జి లక్ష్యాలను ఎందుకు పెట్టవలసి వచ్చింది, వాటి ఉద్దేశ్యాలను పూర్తిగా అర్ధం చేసుకోవాలన్నారు. దుర్భర పేదరికం, ఆకలి ప్రాలద్రోలడం, ప్రాథమిక విద్య, లింగ సమానత్వం, పిల్లల్లో పౌష్టిక విలువలు, శిశు మరణాలు, గర్భిణీ మరణాలు, వ్యాధులు, పర్యావరణ కాలుష్యం, త్రాగునీరు, పరిశ్రమలు, కనీస అవసరాలు తీర్చడం, అవినీతికి తావులేకుండా చూడడం, సమన్యాయం, సమానత్వం, తదితర పలు అంశాలను అధ్యయనం చేసి వాటిని సమర్థవంతంగా రూపుమాపడానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకుని అమలుకు కషి చేయాలని పిలుపు నిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం మానవ అభివద్దికి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుచున్నదని, చేపట్టిన సంక్షేమ పధకాలు, పనులు, వాటికి అనుగుణంగా వాటి వివరాలు ప్రతిబింబించడం పై క్షేత్ర స్థాయి అధికారులు దష్టి పెట్టాలని స్పష్టం చేశారు. ప్రకతిని పరిరక్షిస్తూ, అభివద్ధి చేయడం ద్వారా మాత్రమే సుస్థిర అభివద్ధి సాధ్యం అన్న విషయం ప్రతి ఒక్కరూ గుర్తు ఉంచుకోవాలన్నారు. సుస్థిర అభివద్ధి లక్ష్యాలను సాధించడానికి మరింత సరళీకతం చేసే విధానంలో 20 ప్రాధాన్యత సూచికలను రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించడం జరిగిందన్నారు. వాటిలో ఆరు ఆరోగ్య , రెండు స్త్రీ శిశు సంక్షేమ , నాలుగు విద్య , ఒకటి పురపాలక , ఐదు హౌం , ఒకటి పంచాయతీ రాజ్‌ , ఒకటి వ్యవసాయ శాఖ కి చెందినవి ఉన్నట్లు పేర్కొన్నారు.ప్రజా సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తూ స్పందన పేరును నిర్ధారించామన్నారు. ప్రభుత్వ యంత్రాంగం పని తీరుకు స్పందన కార్యక్రమం అద్దం పట్టేలా పనిచేయాలన్నారు. ప్రజల నుంచి వివిధ సమస్యలపై వచ్చిన అర్జీల పరిష్కారంనకు సంబంధించి సమయంలో పరిష్కారం, నాణ్యతతో కూడిన పరిష్కారం, సమయ పాలన ముఖ్యం మైన అంశాలుగా ఆయన పేర్కొన్నారు. జిల్లాలో అందిన స్పందన ఆర్జీలను నిర్ణీత గడువు లోగా పరిష్కరించినందుకు రెండు జిల్లా కలెక్టర్‌ ను , అధికారులను అభినందించారు. కలెక్టర్‌ కె.వి.ఎన్‌ చక్రధర్‌ బాబు మాట్లాడుతూ మొదటి నుండి జిల్లా గుడ్‌ గవర్నెస్‌ కు పెట్టింది పేరని, ప్రజలకు ప్రభుత్వాన్ని మమేకం చేస్తూ అధికారులు ఎలా ప్రవర్తించాలి అని ఎందరో అధికారులు జిల్లాలో చెరగని ముద్ర వేశారని, అటువంటి గొప్ప వారిలో ఎస్‌.ఆర్‌. శంకరన్‌ గారు ఒకరని గుర్తుచేశారు. ప్రతి ఒక్కరూ వారి మార్గంలో పయనిస్తూ సుస్థిర అభివద్ది లక్ష్యాల సాధనకు కషి చేయాల్సిన అవసరం వుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి దూరదష్టితో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారన్నారు. గడిచిన నాలుగు సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్నో బహత్తరమైన సంక్షేమ, అభివద్ది కార్యక్రమాలను లబ్ధిదారుల ఇంటి వద్దకే చేరేలా ఈ వ్యవస్థ పనిచేస్తున్నదన్నారు. జిల్లాలోని 725 సచివాలయాల ద్వారా ప్రజలకు సంబంధించిన ఎన్నో సర్వీసులను అందిస్తూ గ్రామ స్థాయిలోనే గుడ్‌ గవర్నెస్‌ అమలయ్యేలా కషి చేయడం జరుగుచున్నదన్నారు. రాష్ట్రంలో తొలిసారిగా 2 సచివాలయాల పరిధిలో రిజిస్ట్రేషన్‌ విధానాన్ని నాంధి పలకడం జరిగిందని, ఆ రెండు సచివాలయాలు మన జిల్లాలోనే వుండటం గర్వకారణమన్నారు. అధికారులు స్పందన కార్యక్రమంలో వచ్చిన ఆర్జీల పై ప్రత్యేక దష్టి సారించి బియాండ్‌ ఎస్‌.ఎల్‌.ఏ లేకుండా చూడాల్సిన భాధ్యత అందరిపై వుందన్నారు. ప్రపంచ మొత్తం సుస్థిర అభివద్ది లక్ష్యాల సాధనకు కట్టుబడి పనిచేస్తున్నాయని, మన జిల్లాలో కూడా సుస్థిర అభివద్ది లక్ష్యాల సాధనలో మహిళలు, పిల్లల ఆరోగ్య సూచికలో ముందు వుండేలా అధికారులు కషి చేయాలని పిలుపు నిచ్చారు. ప్రతి స్కూల్‌ లో మౌలికసదుపాయాలు మెరుగుపర్చడంతో పాటు స్కూల్స్‌, ఆసుపత్రులు, అంగన్వాడీ కేంద్రాలు ఈ మూడింటిని సర్వీస్‌ పాయింట్స్‌ గా గుర్తించి పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు ప్రతి నెల వైద్య పరీక్షలు జరపాలని, గుర్తించిన రక్తహీనత వారికి ఐరన్‌ (ఐ ఎఫ్‌ ఎ) మాత్రలు, అదనపు పౌష్టిక ఆహారం తప్పనిసరి అందించాలన్నారు. ఎస్‌.పి. సిహెచ్‌ విజయ రావు మాట్లాడుతూ, ప్రతి వారం స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వివిధ సమస్యలపై వచ్చిన అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించడం జరుగుచున్నదన్నారు. కొన్ని అర్జీలకు సంబంధించి ఇతర శాఖలను సమన్వయం చేసుకొని పరిష్కరించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ముందుగా స్పందన అర్జీల పరిష్కార విధానం శాఖల వారీగా నిర్ధేశించిన సుస్థిర అభివద్ది లక్ష్యాల సాధనకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత శాఖలకు చెందిన రాష్ట్ర రిసోర్స్‌ పర్సన్స్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ కూర్మనాథ్‌, నగర పాలక సంస్థ కమీషనర్‌ హరిత, కందుకూరు సబ్‌ కలెక్టర్‌ శోభిక, ఆడిషనల్‌ ఎస్‌.పి. హిమవతి, నెల్లూరు, కావలి, ఆత్మకూరు ఆర్‌.డి.ఓ లు మలోల, శీనా నాయక్‌, కరుణకుమారి, వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు, క్షేత్రస్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.