Feb 04,2023 22:23

కాంస్య పతకం కైవసం చేసుకున్న హాకీ జట్టు

ప్రజాశక్తి ధర్మవరం టౌన్‌ : స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ ఆధ్వర్యంలో కాకినాడలో జరుగుతున్న రాష్ట్రస్థాయి శాప్‌ హాకీ లీగ్‌ ( అండర్‌-19) పోటీల్లో సత్యసాయి జిల్లా జట్టు కాంస్యపతకం సాధించినట్లు జిల్లా హాకీ ముఖ్యశిక్షకుడు జగన్నాథ్‌ రెడ్డి, కోచ్‌ హస్సేన్‌ తెలిపారు. మొదటి లీగ్‌ మ్యాచ్లో అనకాపల్లి జిల్లా జట్టుపై సత్యసాయి జిల్లా జట్టు 1-0 గోల్‌ తేడాతో విజయం సాధించిందన్నారు. అనంతరం లీగ్‌ మ్యాచ్లో సత్యసాయి జిల్లా తిరుపతి జిల్లా జట్టుతో తలపడి 0-0 స్కోర్‌తో డ్రా చేసిందన్నారు. అనంతరం సెమీఫైనల్లో కాకినాడ జిల్లా జట్టుతో తలపడి 1-0 గోల్స్‌ తేడాతో పరాజయం పాలైందన్నారు. మూడవస్థానం కోసం జరిగిన మ్యాచ్లో పెనాల్టీ షూటౌట్‌లో నెల్లూరు జిల్లా జట్టుపై సత్యసాయిజిల్లా జట్టు 1-2 గోల్‌స తేడాతో విజయం సాదించి కాంస్యపతకం సాదించిందన్నారు. దీంతో జిల్లా ముఖ్యశిక్షకుడు జగన్నాథరెడ్డి, హాకీ కోచ్‌ హస్సేన్‌, ఆంధ్రప్రదేశ్‌ వైస్‌ ప్రసిడెంట్‌ సూర్యప్రకాశ్‌, సీనియర్‌ క్రీడాకారులు కాంస్యపతకం సాధించిన జట్టుసభ్యులను అభినందించారు.