Apr 03,2023 19:47

మాట్లాడుతున్న ఇంటూరి నాగేశ్వరరావు

ప్రజాశక్తి -కందుకూరు :టిడిపి కార్యాలయంలో సోమవారం సోషల్‌ మీడియా కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ టిడిపి కార్యకర్తలు సోషల్‌ మీడియాలో మరింత యాక్టివ్‌గా పని చేయాలని సూచించారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాల సమాచారాన్ని వాట్సాప్‌, ఫేస్బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌ స్టాగ్రామ్‌ ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలన్నారు. ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని, ఇకనుంచి పట్టుదలతో పనిచేసి రాబోయే ఎన్నికల్లో కందుకూరులో టిడిపి ఘన విజయం సాధించేలాగా కృషి చేయాలని నాగేశ్వరరావు కోరారు. పార్లమెంట్‌ ఐటిడిపి అధ్యక్షుడు షేక్‌ రసూల్‌ బాషా ఐటీడీపీ అధ్యక్షుడు షేక్‌ మున్నా మాట్లాడారు. నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు పొడపాటి మహేష్‌ మాట్లాడారు. పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు సవిడిపోయిన వెంకటకష్ణ, మండల తెలుగు యువత అధ్యక్షుడు రావుల రవి, సాకినేని మనోజ్‌ పాల్గొన్నారు.