Aug 30,2022 23:02

ప్రజాశక్తి-జగ్గయ్యపేట: జగ్గయ్యపేటలో సంక్షేమాభివృద్ధికి ప్రజలందరూ సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వ విప్‌, స్థానిక ఎమ్మెల్యే సామినేని ఉదయభాను అన్నారు. మండలంలోని షేర్‌ మహమ్మద్‌పేట గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు వివరిస్తూ వారికి ఇతర సమస్యలు ఉంటే అడిగి తెలుసుకుని అధికారులతో మాట్లాడి వారి సమస్యలను అక్కడికక్కడే ఎమ్మెల్యే పరిష్కరిస్తున్నారు. అనంతరం గ్రామంలో మనబడి నాడు-నేడులో ఫేజ్‌-2లో భాగంగా జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో రూ.84 లక్షలతో ఏడుఅదనపు తరగతి గదుల నిర్మాణ పనులకు, మండల పరిషత్‌ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో రూ.5 లక్షలతో అంగన్వాడి పాఠశాల పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనబడి నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నామన్నారు. విద్యార్థులందరూ ఉన్నత చదువులు చదువుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంక్‌ చైర్మన్‌ తన్నీరు నాగేశ్వరరావు, రాష్ట్ర కార్పొరేషన్‌ డైరెక్టర్లు బత్తుల రామారావు, చేనీకుమారి, మండల పార్టీ అధ్యక్షుడు చిలుకూరు శ్రీనివాస్‌, గ్రామపార్టీ అధ్యక్షుడు దర్శనాల కమలేష్‌, మొరే వినోద్‌ తదితరులు పాల్గొన్నారు.