రగులుతోంది రగులుతోంది
మా గుండె రగులుతోంది
మీరు మాట మార్చితే
మా రక్తం మరుగుతోంది
కొట్టకండి కొట్టకండి కపటం చేసి
మా కడుపులు కొట్టకండి ద్రోహం చేసి
ఎన్నో ప్రాణ త్యాగాలు చేసి నిర్మించుకున్న
పరిశ్రమను అమ్మకండి అమ్మకండి
ఎన్నో ప్రాణ త్యాగాలు చేసి నిర్మించుకున్న
పరిశ్రమను అమ్మకండి అమ్మకండి
తల్లి నుండి బిడ్డను వేరు చేసే
ఆ ప్రైవేట్ వాడికి అమ్మకండి
తల్లినుండి బిడ్డను వేరు చేసే
ఆ ప్రైవేట్ వాడికి అమ్మకండి
రగులుతోంది రగులుతోంది
మా గుండె రగులుతోంది
మీరు మాట మార్చితే
మా రక్తం ఉడుకుతోంది !
ఆనాడు ఐకమత్యంతో
తెల్ల వాడిని తరిమికొట్టాం కదరా
వాడు తోలు మార్చి
మళ్ళి చొరబడుతున్నాడు నువ్ చూడరా
కదలిరా కదలిరా కదలిరా సోదరా
కన్న తల్లి నీ నేలను కాపాడుట నీ బాధ్యతరా
తరలిరా తరలిరా తరలిరా సోదరా
ఇక మౌనం వీడి సర్కారును ప్రశ్నించరా
తప్పు లెక్క వేసి కళ్ళు కప్పిన
ఆ కసాయి వాడి వెన్నెముక కరిగేలా
గర్జించి చెప్పరా
తమనంపల్లి అమృతరావు ఆత్మ శాంతించేలా
ప్రతి తెలుగువాడు గర్వించేలా చెప్పరా
విశాఖ ఉక్కు మన ఆంధ్రుల హక్కు
విశాఖ ఉక్కు మన ఆంధ్రుల హక్కు.
- తంగిశెట్టి జ్యోతి సాయి సుదీప్,
సెల్ : 7981455280










