Sep 01,2022 22:20

ప్రజాశక్తి-మైలవరం
నూతనంగా ఏర్పాటు కానునా సరకు రవాణా రైల్వే లైన్‌ మాకోద్దంటూ పొలాలు కోల్పోతున్న బాధిత రైతులు గురువారం మైలవరం పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. మా బతుకు బండి మాకు కావాలి... రైల్వే లైన్‌ పేరుతో రైతుల భూములను స్వాధీనం చేసుకునే చర్యలను విరమించుకోవాలని, రెండు పంటలు పండే పచ్చని పొలాలను, సారవంతమైన భూములను పరిశ్రమాల పేరుతోపాడు చేయవద్దని భూమిని నమ్ముకున్న రైతుకూలీల పల్లె జీవనాన్ని కాపాడాలని రైతులు ప్లకార్డులు చేతబూని నినాదాలు చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహ శీల్దార్‌కు అందజేశారు. ఈకార్యక్రమంలో మైలవరం, చండ్రగూడెం, కుంటముక్కల గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.