దీక్షా శిబిరంలో ఇంటూరి నాగేశ్వరరావు
ప్రజాశక్తి -ఉలవపాడు :మండలంలోని చాకిచెర్ల పంచాయతీ పరిధిలోని సుబ్బరాయుడు సత్రం దగ్గర, రైల్వే అండర్ పాస్ నిర్మాణానికి వ్యతిరేకంగా గ్రామస్తులు చేపట్టిన ధర్నాలో కందుకూరు నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావు సోమవారం పాల్గొని సంఘీభావం తెలిపారు. మండల పార్టీ అధ్యక్షులు రాచగర్ల సుబ్బారావు, గ్రామస్తులు కొప్పోలు రవి, గోరంట్ల వెంకటరావు, యనమల చిన్నోడు, గోపిశెట్టి రమణయ్య, చల్లగండ్ల శ్రీనివాసులు, ఎందోటి శ్రీనివాసరావు, సన్నెబోయిన సుబ్బారావు, పున్నేపల్లి రవి, మిరియం భాస్కర్, తోట కోటేశ్వరరావు, పాములపాటి వెంకటేశ్వర్లు, ఐటీడీపి కోఆర్డినేటర్ మట్టేపు సురేంద్ర ఉన్నారు.










