Feb 21,2022 07:10

కురుపాం కొండల మీద
కురిసింది వెన్నెల వాన !
కందిచేల మీద విరగపండింది
పసుపు పూలసోన !

మంచెమీద ..
సన్నాయి .. కంజిర
గొగోయ్ .. టిల్లకాయ
పిలనగర్ర ... రేలారే పదం
సామూహిక బృందగానం !

ఎవరు వాళ్లు ?

ఇంకెవరు ..
అడవితల్లి ముద్దుబిడ్డలు !!
- సిరికి స్వామినాయుడు
94940 10330