పసుపు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి
ప్రజాశక్తి-ఉదయగిరి : పసుపు రైతులకు మద్దతు ధర కల్పించి తక్షణమే కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఎపి రైతు సంఘం నాయకులు కాకు వెంకటయ్య డిమాండ్ చేశారు. శనివారం మండల పరిధిలోని కొత్తపల్లి పొలాల్లో రైతులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పసుపు పంటకు క్వింటాకు రూ.10వేలు కనీస మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేసి ఉదయగిరిలో పసుపు కొనుగోలు కేంద్రం ఏర్పాటు ఏర్పాటు చేయాలన్నారు. వెంటనే పసుపు ప్రభుత్వమే రైతు కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసేలా జైలు తీసుకోవాలన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చక్రధర్‌బాబు స్పందించి పసుపు రైతులను ఆదుకోవాలన్నారు. కార్యక్రమంలో రైతులు రైతు కూలీలు గ్రామస్తులు పాల్గొన్నారు.










