వినతిపత్రం అందజేస్తున్న అసోసియేషన్ సభ్యులు
ప్రభుత్వ ప్రణాళికా కార్యదర్శికి వినతి
నెల్లూరు:రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికా కార్యదర్శి జి.ఎస్ ఆర్.కే.ఆర్. విజయ కుమార్‌ను ఏపిజిఈఎ అసోసియేషన్ నాయకులు కలిసి ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను వివరించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. బుధవారం శ్రీ కస్తూర్భా కళాక్షేత్రంలో ఓ కార్యక్రమానికి హాజరైన ప్రభుత్వ ప్రణాళిక కార్యదర్శిని ఏపిజిఈఎ రాష్ట్ర కార్యదర్శి జి శ్రీనివాసులు రెడ్డి జిల్లా అధ్యక్ష కార్యదర్శి లు వై రమణారెడ్డి, వై మల్లికార్జున లు కలిసి ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వివిధ శాఖల ఉద్యోగుల సమస్యలు వారి దష్టికి తీసుకొచ్చారు. ప్రధానంగా 2021-22,2022-23 ఆర్థిక సంవత్సరాలకు సరెండర్ లీవ్ నగదు విడుదల చేయాలని, వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి సరెండర్ లీవ్ నగదు విడుదల జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రొమోషన్ లకు అవకాశాలు తక్కువగా ఉండి ఉన్నత విద్యార్హతలు, అనుభవం, చక్కని పనితీరు కలిగి ఉన్న అర్ధ గణాంక శాఖలో 11 వ పిఆర్‌సి కమిషన్ సిఫారసు చేసిన విధంగా పే స్కేల్ గ్రేడ్ పెంపు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. సచివాలయ ఉద్యోగులలో ఇంకా ప్రొబేషన్ డిక్లరేషన్ ప్రక్రియ పూర్తి కాని అర్హులైన ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లరేషన్ చేయాలని, ఆ శాఖలో జిల్లా స్థాయి అంతర్జిల్లాల బదిలీలకు అవకాశం కల్పించాలని కోరారు.










