అది
ఒక దు:ఖ ప్రాంగణం
అక్కడ గోడకు
పగిలిన ఒక అద్దం తగిలిచ్చి ఉంది
ఆ గోడంతా చెమ్మ చెమ్మగా ఉంది
బహుశా ఆ చెమ్మ ఆ అద్దం దు:ఖం కావొచ్చు
కంటిరెప్పల బరువులను
గోడకు అంటిన కాటుక మరకలు
నిశ్శబ్దంగా శోక దృశ్యాన్ని ఆవిష్కరిస్తున్నాయి
గాయాలతో నిలిచిన నీడలు
చూపుకు ఆనని మర్మం
ఆ చీకటి రాత్రిలో కొడిగట్టిన దీపం
నిశ్శబ్ద వాక్యమై
ఇక, బరువైన ఒక కథగా మిగిలింది!
- లక్ష్మీ కందిమళ్ళ
89196 99815










