Apr 01,2023 19:54

ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభిస్తున్న దృశ్యం

ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభిస్తున్న దృశ్యం
పేదలకు అత్యాధునిక వైద్య సేవలే లక్ష్యం
నెల్లూరు:నగర పాలక సంస్థ పరిధిలోని పేద ప్రజలందరికీ అత్యాధునిక వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ''పట్టణ ఆరోగ్య కేంద్రాలు'' పనిచేస్తాయని ఎం.పి ఆదాల ప్రభాకర్‌ రెడ్డి పేర్కొన్నారు. శనివారం స్థానిక 34వ డివిజను పొదలకూరు రోడ్డులో నూతనంగా నగరపాలక సంస్థ నిర్మించిన పట్టణ ఆరోగ్య కేంద్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరైనారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పరిధిలో లేని కొన్ని వ్యాధులను సైతం ప్రభుత్వం ఈ పధకంలో చేర్చి పేదలందరికీ ఆరోగ్య భద్రత కల్పిస్తుందన్నారు. సాధారణ చెక్‌అప్‌ లతో పాటు అవసరమైన అన్ని మందులను ఉచితంగా అందజేసి ప్రజలపై ఆర్ధిక భారం లేకుండా అన్ని చర్యలు ఈ ప్రభుత్వం తీసుకుందాన్నరు. వయో వద్ధులు, వికలాంగులు, అనారోగ్యంతో ఉన్న చిన్నారులు స్థానిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించి అనుభవజ్ఞులైన వైద్యుల వైద్య సహాయం పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక 19వ డివిజన్‌ మినీ బైపాస్‌, గోమతి నగర్‌, దం రో షో రూమ్‌ సమీపంలో డ్రైను కాలువల నిర్మాణ పనులకు ఆయన శంఖుస్థాపన చేశారు
. అనంతరం స్థానిక ప్రగతి నగర్‌ కూడలిలోని 34/1 వార్డు సచివాలయాన్ని తనిఖీ చేశారు. సచివాలయం ద్వారా ప్రజలకు అందుతున్న వివిధ సంక్షేమ పధకాల అమలును కార్యదర్శులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమము లలో నాయకులు ఆనం విజరు కుమార్‌ రెడ్డి, కొండ్రెడ్డి రంగారెడ్డి, నుడా చైర్మన్‌ ముక్కాల ద్వారకానాద్‌, స్థానిక కార్పొరేటర్‌ షేక్‌ ఫమేదా, నగర పాలక సంస్థ కార్పొరేషన్‌ కమిషనర్‌ శ్రీమతి హరిత ఇంజనీరింగ్‌ విభాగం ఎస్‌.ఈ సంపత్‌ కుమార్‌, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.