Feb 05,2023 21:24

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే సిద్ధారెడ్డి

గాండ్లపెంట : వైసిపి నాయకులు, గృహసారధులు, సచివాలయాల కన్వీనర్లు, వాలెంటీర్లు కలసి పార్టీ ప్రతిష్టను మరింత పెంచాలని ఎమ్మెల్యే సిద్ధారెడ్డి పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని ఫంక్షన్‌ హాల్‌లో గృహసారధులు, సచివాలయాల కన్వీనర్లు, వాలెంటీర్లకకు ఆదివారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు కొండవీటి నాగభూషణం, ఎమ్మెల్యే డాక్టర్‌ పివి సిద్ధారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గృహసారధులు, సచివాలయ కన్వీనర్లు వాలెంటీర్లు సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చూడాలన్నారు. ప్రతి ఇంటి వద్దకు వెళ్లి సంక్షేమ పథకాల అమలు తీరును అడిగి తెలుసుకోవాలన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తాతం జగన్మోహన్‌, మండల కన్వీనర్‌ పోరెడ్డి చంద్రశేఖర్‌ రెడ్డి, వైస్‌ ఎంపీపీలు గంగోజమ్మ, భారతి, జెడ్పీటీసీ భాస్కర్‌రెడ్డితో పాటు ఎంపిటిసిలు, వైసిపి నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.
బుక్కపట్నం : 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా గృహసారథులు పనిచేయాలని పుట్టపర్తి శాసనసభ్యులు దుద్దుకుంట శ్రీధర్‌ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణంలో నూతనంగా ఎంపికైన గృహ సారధులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రతి గడపకు తిరుగుతూ తెలియజేయాలన్నారు. వైసిపి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో మేజర్‌ పంచాయతీ సర్పంచి నాగలక్ష్మి రాజు , ఎంపీపీ శ్రీధర్‌ రెడ్డి, వైస్‌ ఎంపీపీ రత్నాకరం పార్వతి, జెడ్పీటీసీ శ్రీలత గోవర్ధన్‌ రెడ్డి, అగ్రి అడ్వైజరీ చైర్మన్‌ రమణారెడ్డి, కన్వీనర్‌ సుధాకర్‌ రెడ్డి, నాయకులు నాగభూషణం, రామలింగారెడ్డి, ఎంపీటీసీ పద్మావతి, కేశప్ప, మల్లికార్జున, నగేష్‌ తదితరులు పాల్గొన్నారు.